ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar: సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2022-08-10T20:03:06+05:30

బీహార్‌లో 'మహా ఘట్బంధన్' ప్రభుత్వం కొలువుతీరింది. రాజ్‌భవన్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్‌లో 'మహా ఘట్బంధన్' ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మరింత మంది మంత్రులను తదుపరి క్రమంలో నితీష్ తన క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తేజస్వికి నితీష్ అభినందనలు చెప్పారు. నితీష్‌ పాదాలకు తేజస్వి నమస్కరించే ప్రయత్నం చేయడంతో ఆయన వారించి నవ్వుతూ కరచాలనం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, మహా కూటమి నేతలు హాజరయ్యారు. బీహార్ సీఎంగా నితీష్ పగ్గాలు చేపట్టడం ఇది ఎనిమిదో సారి.







ప్రమాణస్వీకారం అనంతరం తేజస్వి యాదవ్‌ను నితీష్ అభినందించారు. నితీష్‌ పాదాలకు అభివందనం చేయడానికి తేజస్వి ప్రయత్నించగా, నితీష్ నవ్వుతూ ఆయనతో కరచాలనం చేశారు. బీహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


Updated Date - 2022-08-10T20:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising