ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar CM : ప్రధాన మంత్రి పదవిపై మనసులో మాట బయటకు చెప్పేసిన నితీశ్ కుమార్

ABN, First Publish Date - 2022-08-12T18:46:09+05:30

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన మనసులో మాటను వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, తాను ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా పని చేయాలని చెప్పారు. తన మనసులో ప్రస్తుతం ప్రధాన మంత్రి పదవిపై ఆకాంక్షలేవీ లేవని మరోసారి స్పష్టం చేశారు. అయితే తనకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. 


నితీశ్ కుమార్ ఆగస్టు 10న బిహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తొమ్మిదో తేదీన ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి, ప్రతిపక్ష ఆర్జేడీ, మరికొన్ని పార్టీలతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నితీశ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో విజయం సాధించారని, 2024లో గెలుపు కోసం ఆయన ఆందోళన చెందక తప్పదని అన్నారు. అయితే ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారా? అని విలేకర్లు అడిగినపుడు ఆయన స్పందిస్తూ, తాను ఏ పదవికీ పోటీదారును కాదని చెప్పారు. ‘‘2014లో వచ్చిన వ్యక్తి 2024లో గెలుస్తారా? అనేది అడగవలసిన ప్రశ్న అని చెప్పారు. 


శుక్రవారం నితీశ్ మాట్లాడినపుడు కూడా ఇదే ప్రశ్నను విలేకర్లు సంధించారు. అందుకు ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ, ‘‘నా మనసులో ఆ విషయం లేదు. ఎవరు ఏం చెప్పినా, నాకు సన్నిహితులు చెప్పినప్పటికీ, నా మనసులో ఆ ఆలోచన లేదు’’ అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తే గొప్ప విషయం అవుతుందని, దాని కోసం ప్రయత్నించడమే తన పని అని వివరించారు. ప్రజల సమస్యల గురించి తామంతా చర్చిస్తామని, మెరుగైన సమాజం కోసం తాము ఏం చేయగలమో నిర్ణయించుకుంటామని చెప్పారు. 


బీజేపీ ఆగ్రహం

నితీశ్ కుమార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీ ఎంపీ ఛేది పాశ్వాన్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి పదవి కోసం నితీశ్ కుమార్ అధోజగత్తు నాయకుడు దావూద్ ఇబ్రహీంతోనైనా చేతులు కలుపుతారని ఎద్దేవా చేశారు. నితీశ్ విశ్వసనీయత లేని వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ఎన్నటికీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేరని జోస్యం చెప్పారు. 


Updated Date - 2022-08-12T18:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising