ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Key portfolios: నితీష్ చేతుల్లోనే హోం.. ఆర్జేడీకి సింహభాగం, తేజ్ ప్రతాప్‌కూ బెర్త్

ABN, First Publish Date - 2022-08-16T20:27:07+05:30

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలకమైన హోం శాఖను తనవద్దే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar) కీలకమైన హోం (Home) శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆరోగ్య శాఖను తన డిప్యూటీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు (Tejaswi yadav) ఇచ్చారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు  (Tej pratap) పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ ఇచ్చారు. జేడీయూ నేత విజయ్ చౌదరికి ఆర్థిక శాఖ దక్కింది. నితీష్ క్యాబినెట్‌లో 31 మంది మంగళవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి నితీష్ శాఖలు కేటాయించారు.


సింహభాగం ఆర్జేడీకే

నితీష్ క్యాబినెట్‌లో సింహభాగం ఆర్జేడీకి దక్కింది. ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చాకు ఒక మంత్రి పదవి దక్కింది. ఒక స్వతంత్ర అభ్యర్థికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు.


ఐదుగురు ముస్లింలకు చోటు...

నితీష్ పాత క్యాబినెట్‌లో (NDA government) ఒకే ఒక ముస్లిం నేతకు మంత్రివర్గంలో చోటు దక్కగా, నితీష్ కొత్త క్యాబినెట్‌లో ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలకు చోటు లభించింది. యాదవులకు గణనీయంగా ఏడు పదవులు దక్కాయి. ఆర్జేడీ కోటాలో కార్తికేయ సింగ్ (భూమిహార్ ఎమ్మెల్సీ), సుధారక్ సింగ్ (రాజ్‌పుట్)కు చోటు కల్పించగా, జేడీయూ తన పాత మంత్రివర్గంలోని అగ్రవర్ణాల వారిని కొనసాగించింది. దళిత, ముస్లిం వర్గానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం కల్పించింది.

Updated Date - 2022-08-16T20:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising