ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar: లాలూకు నితీష్ ఫోన్... 2 గంటలకు కొత్త సర్కార్ ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2022-08-10T19:38:19+05:30

బీహార్‌లో నితీష్ సారథ్యంలోని మహా గఠ్బంధన్ ప్రభుత్వం కొలువుతీరనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్‌లో నితీష్ సారథ్యంలోని మహా గఠ్బంధన్ ప్రభుత్వం కొలువుతీరనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంరంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. 71 ఏళ్ల నితీష్ కుమార్ వరుసగా 8వ సారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఈ తరుణాన్ని పురస్కరించుకుని తన పాత మిత్రుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు నితీ‌ష్ ఫోను చేశారు. తాజా రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు. నితీష్ తీసుకున్న నిర్ణయాన్ని లాలూ ప్రసాద్ ఈ సందర్భంగా అభినందించారు.


కాగా, రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో నితీష్ కుమార్ చేత సీఎంగా గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆర్జేడీ శాసనసభా పక్షనేతగా మంగళవారంనాడు ఎన్నికైన తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. నితీష్ సీఎం పదవితో పాటు హోం శాఖను తమ (జేడీయూ) వద్దనే ఉంచుకోనున్నారు. స్పీకర్ పదవి ఆర్జేడీకి ఇవ్వనున్నారు.


ప్రశాంత్ కిషోర్ ట్వీట్...

కాగా, బీహార్‌లో రాజకీయ సుస్థిరత ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని ప్రశాంత్ కిషోర్ (పీకే) ఓ ట్వీట్‌లో వ్యక్తం చేశారు. కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్టు నితీష్ చెప్పారని, బీహార్ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారని తాను ఆశిస్తున్నానని పీకే అన్నారు.



Updated Date - 2022-08-10T19:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising