ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asauddin Owaisi: నితీశ్‌‌ను టార్గెట్ చేసిన ఒవైసీ

ABN, First Publish Date - 2022-09-11T02:24:17+05:30

అహ్మదాబాద్: బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు యత్నిస్తోన్న జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్‌పై ఎంఐఎం అధినేత,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు యత్నిస్తోన్న జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. అహ్మదాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీతో ఉన్న నితీశ్ ఆ తర్వాత 2015లో ఎన్డీయే కూటమిని వదిలిపెట్టారని చెప్పారు. 2017లో మళ్లీ జట్టు కట్టి 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని ఒవైసీ గుర్తు చేశారు. తీరా ఇప్పుడు మళ్లీ బీజేపీని వదిలిపెట్టారని చెప్పారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత కూడా ఒక్కోసారి ఎన్డీయే, ఆర్ఎస్ఎస్ నేతలపై ప్రశంసలు కురిపించారని ఒవైసీ విమర్శించారు. మైనార్టీల అభివృద్ధి, హక్కుల విషయం వచ్చినప్పుడు ఈ నేతలెవ్వరూ మాట్లాడరని, అయితే సెక్యులరిజం గురించి మాత్రం  మాట్లాడుతుంటారని ఒవైసీ ఆరోపించారు.   


మరోవైపు దేశానికి బలహీన ప్రధాని ఉండటం మేలని ఒవైసీ అభిప్రాయపడ్డారు. బలమైన ప్రధానులు దేశానికేమీ చేయలేకపోతున్నారని, కేంద్రంలో కిచిడీ ప్రభుత్వాలుండటమే మేలని ఒవైసీ చెప్పారు. 


కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే ఒవైసీ... నితీశ్, మమతలను విమర్శించడంతో బీజేపీయేతర ఫ్రంట్‌లో ఉండకపోవచ్చని ఆయన తాజా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. 


నితీశ్, కేసీఆర్ ఇప్పటికే దేశంలోని అగ్రనేతలందరనీ కలిశారు. నితీశ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. మోదీని గద్దె దించేందుకు బీజేపీయేతర పార్టీల నేతలంతా కూటమి కావాలని నితీశ్, కేసీఆర్ కోరుతున్నారు. బీజేపీకి బద్ద వ్యతిరేకి అయిన ఒవైసీ నితీశ్, మమతలను విమర్శించడం ప్రకంపనలు రేపుతోంది.

Updated Date - 2022-09-11T02:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising