ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేజస్వీ ఇఫ్తార్ విందుకు నితీశ్ కుమార్

ABN, First Publish Date - 2022-04-23T01:33:26+05:30

బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం హాజరయ్యారు. పాట్నాలోని 10 సర్క్యూలర్‌ రోడ్‌లో ఉన్న తేజస్వీ నివాసానికి నితీష్ స్వయంగా వచ్చి ఇఫ్తార్ విందు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం హాజరయ్యారు. పాట్నాలోని 10 సర్క్యూలర్‌ రోడ్‌లో ఉన్న తేజస్వీ నివాసానికి నితీష్ స్వయంగా వచ్చి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కాగా, 2017లో లాలూ నివాసంలో ఇచ్చిన విందుకు నితీశ్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆర్‌జేడీ, జేడీయూ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాగా, తాజా విందుకు వచ్చిన నితీశ్‌కు లాలూ భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్వాగతం పలికారు. నితీశ్‌తో పాటు బిహార్ కాంగ్రెస్ అధినేత మదన్ మోహన్ ఝా, పరిశ్రమల శాఖ మంత్రి షానవాజ్ హుస్సేన్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు ఈ విందుకు హాజరయ్యారు.


ఇదిలా ఉండగా, ఇదే రోజు రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనకు సీబీఐ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో కొంత కాలంగా జైలులో ఉన్న లాలూ యాదవ్‌ తొందరలోనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

Updated Date - 2022-04-23T01:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising