ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirav Modi : నీరవ్‌ మోదీ అప్పగింతకు లైన్‌ క్లియర్‌

ABN, First Publish Date - 2022-12-16T01:00:49+05:30

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌లో అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. గుజరాత్‌కు చెందిన 51 ఏళ్ల వయసున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్‌ సుప్రీంకోర్టులో అప్పీలుకు అనుమతి నిరాకరణ

న్యూఢిల్లీ, లండన్‌, డిసెంబరు 15: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌లో అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. గుజరాత్‌కు చెందిన 51 ఏళ్ల వయసున్న ఈ వజ్రాల వ్యాపారి 2019 మార్చి నుంచి లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైల్లో ఉన్నాడు. ఇరుదేశాల మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం అతడిని భారత్‌కు అప్పగించడానికి బ్రిటన్‌ హైకోర్టు గతనెలలోనే అనుమతిచ్చింది. దానిపై బ్రిటన్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో అతను పిటిషన్‌ వేశాడు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు గురువారం అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అతనికి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు మూసుకుపోయాయి. అయితే, ఐరోపా మానవ హక్కుల కోర్టును ఆశ్రయించే ఏకైక అవకాశం అతనికి మిగిలి ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను మోసం చేసిన రూ.13 వేల కోట్ల కుంభకోణంలో నీరవ్‌ ప్రధాన నిందితుడు.

Updated Date - 2022-12-16T01:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising