ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid కేసులు పెరిగినా ఆసుపత్రుల్లో 95శాతం పడకలు ఖాళీనే...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

ABN, First Publish Date - 2022-01-21T17:14:17+05:30

మహారాష్ట్రలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా ఆసుపత్రుల్లో 95 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్రలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా ఆసుపత్రుల్లో 95 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. కొవిడ్ రెండో వేవ్ తో పోలిస్తే మూడో వేవ్ లో ఆసుపత్రుల్లో  చేరే కరోనా రోగుల సంఖ్య తక్కువగా ఉందని మంత్రి చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో 4 నుంచి 5 శాతం మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివిటీ రేటు 23.5 శాతంగా ఉందని, అయితే రాయ్ ఘడ్, పూణే, నాసిక్, నాందేడ్ జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే అధిక కరోనా కేసులు నమోదైనాయని మంత్రి పేర్కొన్నారు.టీనేజర్లకు కొవిడ్ టీకా మొదటి డోసు వేశామని మంత్రి చెప్పారు. జనవరి చివరి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో కోవిడ్ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య మహారాష్ట్రలో పెరిగే అవకాశం ఉందని మంత్రి వివరించారు.


Updated Date - 2022-01-21T17:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising