ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagpur సెంట్రల్ జైలులో 9 మంది ఖైదీలకు Covid positive

ABN, First Publish Date - 2022-06-25T17:09:50+05:30

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్(మహారాష్ట్ర):మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో 9 మంది ఖైదీలకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నాగపూర్ నగరంలో పెరుగుతున్న అంటువ్యాధుల దృష్ట్యా నాలుగు రోజుల క్రితం 12 మంది జైలు ఖైదీలు కొవిడ్ -19 పరీక్షలు చేయించుకున్నారు. శాంపిల్స్‌లో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత జైలు అధికారులు కరోనా సోకిన వారితో కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించారు.శుక్రవారం మరో ఐదుగురు ఖైదీలకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీంతో జైలులో కరోనా రోగుల సంఖ్య 9కి చేరుకుంది. ఖైదీలకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయి.  నాగ్‌పూర్‌లో గత 24 గంటల్లో 65 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 


శుక్రవారం జిల్లాలో 1,899 నమూనాలను పరీక్షించగా, అందులో ఐదుగురు ఖైదీలతో సహా 65 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.కరోనా సోకిన వారిలో నాగపూర్ నగరానికి చెందిన 46 మంది, గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 మంది ఉన్నారు.మరో 60 మంది కరోనా రోగులు కోలుకున్నారు. నాగపూర్ నగరంలో 223 మంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 132 మందితో సహా జిల్లాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 355గా ఉంది. నలుగురు కరోనా రోగులను ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయగా, మరో 353 మందిని క్వారంటైన్‌లో ఉన్నారు. 


Updated Date - 2022-06-25T17:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising