ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: బస్సులు ఢీకొని ఘోర ప్రమాదం...9మంది మృతి, 35మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-10-06T14:46:13+05:30

కేరళ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలక్కాడ్‌(కేరళ): కేరళ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పాలక్కాడ్‌ నగరంలోని (Keralas Palakkad)వడక్కంచెరి ప్రాంతంలో కేరళ ప్రభుత్వ బస్సును టూరిస్టు బస్సు(tourist vehicle rear ended a Kerla government bus) వెనుక నుంచి ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి ఎంబీ రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు,ముగ్గురు కేఎస్ఆర్టీసీ ప్రయాణీకులు మరణించారు. మరో 35 మంది క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు.


టూరిస్ట్ బస్సు ఎర్నాకులం జిల్లా బసేలియోస్ విద్యానికేతన్ నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులతో తమిళనాడులోని ఊటీ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.కేఎస్ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్‌లను మోహరించి  రెస్క్యూ సిబ్బంది బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం చేస్తున్నామని కేరళ మంత్రి ఎంబీ రాజేష్ చెప్పారు. 



Updated Date - 2022-10-06T14:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising