ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెలలో వైరస్‌ ప్రభావం తగ్గొచ్చు

ABN, First Publish Date - 2022-01-17T14:33:43+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం అంచలం చెలుగా తగ్గే అవకాశం ఉందని, ఫిబ్రవరి రెండో వారం తర్వాత కరోనా వ్యాప్తిలో బాగా తగ్గుదల ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - ఆర్యోగశాఖ ముఖ్యకార్యదర్శి రాధాకృష్ణన్‌


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం అంచలం చెలుగా తగ్గే అవకాశం ఉందని, ఫిబ్రవరి రెండో వారం తర్వాత కరోనా  వ్యాప్తిలో బాగా తగ్గుదల ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరిందన్నారు. అదేసమయంలో సంక్రాంతి కోసం నగర వాసులు సొంతూళ్ళకు వెళ్ళారని, ఈ కారణంగా గత రెండు రోజులుగా చెన్నైలో పాజిటివ్‌ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించలేదన్నారు. కానీ, ఇతర జిల్లాల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ.. ఇతర రోజుల్లో అనేక మంది గుంపులు గుంపులుగా చేరుతున్నారని, ఇలాంటి వారు మాస్కు ధరించడం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రస్థాయికి చేరిన కరోనా వ్యాప్తి ఫిబ్రవరి రెండో వారం తర్వాత తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. 

Updated Date - 2022-01-17T14:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising