ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ కొత్త వేరియంట్ ఐహెచ్‌యూ గుర్తింపు... ఇది మరింత ప్రమాదకరమా?...

ABN, First Publish Date - 2022-01-04T17:44:18+05:30

ఒమైక్రాన్ కన్నా ప్రమాదకరమైన కోవిడ్-19 రూపాంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్ : ఒమైక్రాన్ కన్నా ప్రమాదకరమైన కోవిడ్-19 రూపాంతరం ఐహెచ్‌యూ, B.1.640.2ను ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటెర్రేనీ ఇన్ఫెక్షన్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలో 46 మ్యుటేషన్లు ఉన్నాయి. ఇది ప్రస్తుత వ్యాక్సిన్లను సైతం తట్టుకోగలదు. ఇది ఒమైక్రాన్ కన్నా వేగంగా వ్యాపించగలదు. 


ఐహెచ్‌యూ, B.1.640.2ను దాదాపు 12 కేసుల్లో గుర్తించినట్లు ఈ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కేసులు మార్సీల్లెస్ సమీపంలో నమోదయ్యాయని, వీరు ఆఫ్రికన్ దేశం కామెరూన్‌ వెళ్ళి వచ్చినట్లు వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచంలో అత్యధిక ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తోందని, ఐహెచ్‌యూ వేరియంట్ ముప్పు వేగంగా పెరుగుతోందని తెలిపారు. 


B.1.640.2ను ఇతర దేశాల్లో గుర్తించలేదు. అదేవిధంగా ‘వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించలేదు. 


ఇదిలావుండగా, ఎపిడమాలజిస్ట్ ఎరిక్ ఫీగిల్-డింగ్ ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. అయితే అవి అత్యంత ప్రమాదకరమైనవని భావించవలసిన అవసరం లేదు. వృద్ధి చెందే సామర్థ్యాన్నిబట్టి వేరియంట్ల హానికారకతను గుర్తిస్తారు. 


Updated Date - 2022-01-04T17:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising