కొత్త కార్పొరేషన్లలో కొలువుదీరిన పాలక వర్గాలు
ABN, First Publish Date - 2022-03-05T15:09:46+05:30
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ), కొత్తగా ఏర్పాటైన ఆవడి, తాం బరం మేయర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జీసీసీ మేయర్‌గా ప్రియ, ఆవడి మేయర్‌గా ఉదయ కుమార్, తాంబరం మేయర్‌గా వసంతకుమారి ఏ
- తాంబరంలో వసంతకుమారి
- ఆవడికి ఉదయకుమార్
- ముగిసిన ప్రమాణస్వీకారం
చెన్నై: గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ), కొత్తగా ఏర్పాటైన ఆవడి, తాంబరం మేయర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జీసీసీ మేయర్‌గా ప్రియ, ఆవడి మేయర్‌గా ఉదయ కుమార్, తాంబరం మేయర్‌గా వసంతకుమారి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. మూడున్నర శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్‌గా డీఎంకేకు చెందిన ఆర్.ప్రియా శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేదీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించి మేయర్ పదవికి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. డీఎంకే తరఫు అభ్యర్థిగా ప్రియ నామినేషన్ పత్రాలను ఆయనకు సమర్పించారు. కాసేపయ్యాక మేయర్ పదవికి ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభ్యుల హర్ష ద్వానాల మధ్య ప్రకటించారు. ఆ తర్వాత ఆమె చేత ప్రమాణస్వీ కారం చేయించి, మేయర్ వేదిక వద్దకు తోడ్కొని వెళ్ళారు. ఎరుపు రంగు మేయర్ అంగీని ఆమెకు అందించి ధరింపజేశారు. తరువాత కమిషనర్ అందజేసిన 108 సవర్ల బంగారు గొలుసును ఆమె మెడలో వేసుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మంత్రులు పీకే శేఖర్‌బాబు, ఎం.సుబ్ర మణ్యం, కమిషనర్ గగన్‌దీప్ సింగ్‌తో కలిసి ఆమెకు మేయర్ రాజదండాన్ని అప్పగించారు. అనంతరం ప్రియ మేయర్ కుర్చీలో కూర్చోగానే కొత్త కార్పొరేటర్లు, మంత్రులు, అధికారులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కమిషనర్ గగన్‌దీప్ సింగ్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేయర్ ఎన్నికల ప్రక్రియను కమిషనర్ గగన్‌దీప్ సింగ్ తమిళంలో నిర్వహించి సభ్యుల ప్రశంసలందుకున్నారు. కాగా చెన్నై డిప్యూటీ మేయర్‌గా ఎం.మహేష్ కుమార్ ప్రమాణం చేశారు.
ఆవడి కార్పొరేషన్లో...
కొత్తగా ఏర్పాటైన ఆవడి కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మంత్రి ఎస్ఎం నాజర్ సమక్షంలో జరిగింది. ఆ కార్పొరేషన్లో మొత్తం 48 వార్డుల్లో 35 స్థానాలు కైవసం చేసుకున్న డీఎంకే ఆవడి తొమ్మిదో వార్డు కార్పొరేటర్ ఉదయ కుమార్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ మేరకు ఆవడి కౌన్సిల్‌హాలులో శుక్రవారం ఉదయం పది గంటలకు కమిషనర్ సరస్వతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. ఉదయ కుమార్ మాత్రమే నామినేషన్ వేయడంతో మేయర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిషనర్ ప్రకటించి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. మేయర్ అంగీని, రాజదండాన్ని అందజేశారు. మంత్రి ఎస్ఎం. నాజర్, కమిషనర్ సరస్వతి కలిసి ఉదయ కుమార్‌ను మేయర్ కుర్చీ వరకు తీసుకువెళ్లి కూర్చుండ బెట్టారు. మధ్యాహ్నం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎండీఎంకే 23 వార్డు కార్పొరేటర్ సూర్యకుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా కమిషనర్ సరస్వతి ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు.
తాంబరం కార్పొరేషన్లో..
కొత్తగా ఏర్పాటైన తాంబరం కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు శుక్రవారం ఉదయం మంత్రి దామో అన్బరసన్, ఎమ్మెల్యేలు ఎస్ఆర్ రాజా, ఇ.కరుణానిధి సమక్షంలో జరిగాయి. ఈ కార్పొరేషన్లో 70 వార్డులు న్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 54 వార్డుల్లో గెలవడంతో ఈ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థిగా వసంతకుమారిని ప్రకటిం చింది. ఆ మేరకు కొత్త కార్పొరేషన్ కౌన్సిల్‌హాలులో శుక్రవారం ఉదయం కమిషనర్ ఇళంగోవన్ ఎన్నికల ప్రక్రియను ప్రారం భించారు. వసంతకుమారి మేయర్ పదవికి నామినేషన్ వేయగా, ఇతర సభ్యులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆమెను ఏకగ్రీవంగా గెలిచినట్లు కమిషనర్ ప్రకటించారు. ఆ తర్వాత వసంత కుమారికి మేయర్ కొత్త అంగీని, రాజ దండాన్ని కమిషనర్ అందించారు. ఈ వేడుకలకు మంత్రి దామో అన్బరసన్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కామరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Updated Date - 2022-03-05T15:09:46+05:30 IST