ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఎన్నికల్లో పోటీ చేయను: మాజీ ముఖ్యమంత్రి

ABN, First Publish Date - 2022-01-19T21:52:18+05:30

నా గురించి ఇప్పటికే మీతో చెప్పాను. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నా పూర్తి సమయాన్ని కేటాయిస్తాను. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యువ నాయకత్వం చేతిలో ఉంది,,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఎన్నికల్లో పోటీ చేయనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ తొందరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని బుధవారం నడ్డాకు రాసిన లేఖలో రావత్ పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యువ నాయకత్వం చేతిలో ఉందని, రాజకీయాల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పుకొచ్చారు.


‘‘నా గురించి ఇప్పటికే మీతో చెప్పాను. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నా పూర్తి సమయాన్ని కేటాయిస్తాను. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యువ నాయకత్వం చేతిలో ఉంది. రాజకీయాల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా తాను ఈ ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ముందే తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంగీకరించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నా అభ్యర్థనను అంగీకరిస్తే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నేను నిమగ్నమై ఉంటాను’’ అని జేపీ నడ్డాకు రాసిన లేఖలో త్రివేంద్ర సింగ్ రావత్ రాసుకొచ్చారు.

Updated Date - 2022-01-19T21:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising