ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'NEET': ‘నీట్‌’లో తగ్గుతున్న ఉత్తీర్ణత

ABN, First Publish Date - 2022-09-09T16:52:45+05:30

వైద్యకోర్సుల ప్రవేశానికి నిర్వహించే ‘నీట్‌’ పరీక్షలో రాష్ట్ర విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - విద్యావేత్తల ఆందోళన


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 8: వైద్యకోర్సుల ప్రవేశానికి నిర్వహించే ‘నీట్‌’ పరీక్షలో రాష్ట్ర విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్‌ అమలు చేసినప్పటి నుంచి అప్పటి అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అన్నాడీఎంకే, అనంతరం డీఎంకే ప్రభుత్వాలు నీట్‌ నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ శాసనసభలో ఆమోదించిన బిల్లు గవర్నర్‌(Governor)కు పంపినా, నేటికి దానిలో చలనం లేదు. ఈ నేపథ్యంలో, బుధవారం వెలువడిన నీట్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు 51.30 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యా రు. గత ఏడాది ఈ పరీక్షకు 1,08,318 మంది హాజరుకాగా 58,922 (54.40 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 1,32,167 మంది విద్యార్థులు హాజరుకాగా 67,787 (51.30 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది నీట్‌ ఫలితాల్లో తమిళనాడు(Tamil Nadu) 23వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 28వ స్థానానికి పడిపోయింది. తొలి 50 ర్యాంకుల్లో ఇద్దరు మాత్రమే రాష్ట్ర విద్యార్థులు నిలిచారు. త్రిదేవ్‌ వినాయక 705 మార్కులతో రాష్ట్రంలో ప్రథమస్థానం, జాతీయ స్థాయిలో 30వ స్థానంలో నిలిచింది. అలాగే, హరిణి అనే విద్యార్థిని 702 మార్కులతో రాష్ట్రంలో రెండవ స్థానం, జాతీయస్థాయిలో 43వ స్థానంలో నిలిచింది. 


80 శాతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫెయిల్‌....

ఈ ఏడాది నీట్‌లో 80 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు 17 వేల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసింది. కానీ కేవలం 20 శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారు.

Updated Date - 2022-09-09T16:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising