ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్‌ రద్దు కోసం పార్లమెంట్‌లో...

ABN, First Publish Date - 2022-02-01T13:22:12+05:30

నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించాలని, ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానంపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు సోమవారం పార్లమెంటు సెంట్రల్‌ హా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించాలని, ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానంపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు సోమవారం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో గళమెత్తారు. నీట్‌ మిన హాయింపు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నిర్లక్ష్య ధోరణి అవలంబి స్తున్నా రంటూ విమర్శించారు.. సోమవారం ఉదయం రాష్ట్రపతి రామనాధ్‌కోవింద్‌ పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడానికి ముందు రాష్ట్ర ఎంపీలు ధర్నా జరిపారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రారంభించగానే ఎంపీలు తమ తమ సీట్లలో కూర్చున్నారు. నీట్‌కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసినా, దానిపై ఇప్పటి వరకూ గవర్నర్‌ ఆమోదముద్ర వేయక పోవడాన్ని అధికార పార్టీ తీవ్రంగా భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని భావించిన డీఎంకే.. పార్లమెంటులో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీలు మాట్లాడుతూ.. నీట్‌ వ్యవ హారంపై మున్ముందు మరిన్ని నిరసనలు చేపడతామని ప్రకటించారు.

Updated Date - 2022-02-01T13:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising