ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం ఆశించేవాళ్లుగా ఉండకూడదు: నిరుద్యోగంపై కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2022-04-07T18:39:57+05:30

మన దేశంలో 25 కోట్ల మంది స్కూలుకు వెళ్లే చిన్నారులు ఉన్నారు. 4 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యాను పూర్తి చేసి ఉన్నారు. ఇక ఒకేషనల్, ఐటీఐ, స్కిల్లింగ్, లాంటి కోర్స్‌లు పూర్తి చేసిన వారు 3 నుంచి 4 కోట్లు ఉన్నారు. మొత్తంగా సిస్టమ్‌ను చేరుకునే విద్యార్థులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా ఉద్యోగం కల్పించేవాళ్లుగా యువతను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై బుధవారం ఆయన స్పందిస్తూ దేశంలో 52.5 కోట్ల మంది 23 ఏళ్లలోపు వారేనని, వీరిలో 35 శాతం మంది విద్యా, నైపుణ్యాలు కలిగిన వారని, వీరిని కేవలం ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా ఉద్యోగం కల్పించేవాళ్లుగా తీర్చిదిద్దితే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.


ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘‘ఎడ్యూకేషన్ సమ్మిట్-2022’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. అనంతరం వారు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘మన దేశంలో 25 కోట్ల మంది స్కూలుకు వెళ్లే చిన్నారులు ఉన్నారు. 4 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యాను పూర్తి చేసి ఉన్నారు. ఇక ఒకేషనల్, ఐటీఐ, స్కిల్లింగ్, లాంటి కోర్స్‌లు పూర్తి చేసిన వారు 3 నుంచి 4 కోట్లు ఉన్నారు. మొత్తంగా సిస్టమ్‌ను చేరుకునే విద్యార్థులు 34 నుంచి 35 కోట్ల మంది ఉన్నారు. అయితే వీరంతా కేవలం ఉద్యోగులుగా మారితే దేశానికి జరిగే ఉపయోగం పెద్దగా ఏమీ లేదు. అలా జరిగితే వినియోగ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. దీనిని మనం యజమాని ఆర్థిక వ్యవస్థగా, వ్యవస్థాపక ఆర్థిక వ్యవస్థగా మార్చాలి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-07T18:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising