ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవా ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్, టీఎంసీలతో చర్చిస్తున్నాం : శరద్ పవార్

ABN, First Publish Date - 2022-01-11T22:28:27+05:30

గోవా శాసన సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్, టీఎంసీలతో చర్చిస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : గోవా శాసన సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్, టీఎంసీలతో చర్చిస్తున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చెప్పారు. తమకు కావలసిన స్థానాల జాబితాను ఆ పార్టీలకు అందజేశామని చెప్పారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గోవాలో మార్పు అవసరమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలన్నారు. కలిసికట్టుగా పోటీ చేయాలనే అంశంపై ఎన్‌సీపీ, కాంగ్రెస్, టీఎంసీ మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 


ఇదిలావుండగా, గోవా శాసన సభ ఎన్నికల్లో టీఎంసీతో పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తమ పార్టీ అటువంటి చర్చలేవీ జరపడం లేదని తెలిపింది. కాంగ్రెస్ నేత దినేశ్ ఆర్ గుండూరావు సోమవారం మాట్లాడుతూ, గోవాలో టీఎంసీ వైఖరి మొదటి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉందన్నారు. బీజేపీని వ్యతిరేకించడానికి బదులు కాంగ్రెస్‌ను టీఎంసీ వ్యతిరేకిస్తోందన్నారు. గోవా శాసన సభ ఎన్నికల్లో టీఎంసీతో పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరగడం లేదని తెలిపారు. టీఎంసీ తమ పార్టీ (కాంగ్రెస్) ఎమ్మెల్యేలను చేర్చుకుందని, ఇప్పుడు ఆ పార్టీకి సీట్లు రావడం కోసం తమతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటోందని అన్నారు. 


ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది. 


Updated Date - 2022-01-11T22:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising