ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహో నాయకా..!!

ABN, First Publish Date - 2022-03-05T07:04:07+05:30

త్రువు తనకంటే బలవంతుడైనా... తమ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్నా ఆయన వెనక్కి తగ్గలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉక్రెయిన్‌ అధ్యక్షుని మొండి ధైర్యం

న్యూఢిల్లీ, మార్చి 4 : శత్రువు తనకంటే బలవంతుడైనా... తమ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. నువ్వు మొండైతే నేను జగమొండి అనే రీతిలో రష్యాను ఢీకొడుతున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమర్‌ జెలెన్‌స్కీ. ప్రాణ భయంతో ప్రజలు దేశం వదిలిపోతున్నా... జెలెన్‌స్కీ మాత్రం మొండిగా నిలబడ్డారు. పూర్తిస్థాయి సైనికుడిలా కదనరంగంలోకి వచ్చి తమ సేనలను ప్రోత్సహిస్తున్నారు. తనకు రక్షణ కల్పించి ఆశ్రయమిస్తామని పరాయి దేశాలు ఆహ్వానాలు పంపినా.. ప్రాణం కంటే తనకు దేశమే ముఖ్యమని చెప్పి వాటిని తిరస్కరించారు. గురువారానికి ఏడు రోజుల యుద్ధం పూర్తి కాగా.. జెలెన్‌స్కీ చూపెడుతున్న గుండె ధైర్యానికి ఆ దేశ ప్రజలు సహా అనేక దేశాలు ‘‘సాహో నాయకా’’ అంటున్నాయి. యుద్ధం మొదలవ్వడానికి ఒక రోజు ముందు.. శత్రువు దాడి చేస్తే వెన్ను చూపేది లేదంటూ జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యా ప్రధాన లక్ష్యం తాను, తన కుటుంబం అని తెలిసినా ప్రజలను, దేశాన్ని వదిలిపోనని స్పష్టం చేశారు. అణు దాడుల ముప్పు పొంచి ఉన్నా... శత్రు దేశంపై ధిక్కరణ స్వరం కొనసాగిస్తూనే వచ్చారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఉక్రెయిన్‌కు అండగా ఉన్నదో లేదో చెప్పాలని కోరుతూ ఈయూ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఉద్విగ్నభరిత ప్రసంగం చేసి పలువురిని కంటతడి పెట్టించారు.  బెలారస్‌ వేదికగా ఇరుదేశాల మధ్య శాంతిచర్చలు విఫలమైన నేపథ్యంలో... పుతిన్‌తో తానే స్వయంగా మాట్లాడతానని, అప్పుడే యుద్ధం ఆగుతుందని మరోమారు చర్చలకు పిలుపునిచ్చారు. ఇలాంటి అనేక అంశాల వల్లే ప్రపంచ దేశాలు జెలెన్‌స్కీపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

Updated Date - 2022-03-05T07:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising