ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్యుడిషియల్ కస్టడీకి నవాబ్ మాలిక్

ABN, First Publish Date - 2022-03-07T20:27:10+05:30

మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ను ఈనెల 21 వరకూ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ను ఈనెల 21 వరకూ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు సోమవారంనాడు ఆదేశించింది. అజ్ఞాత నేర ప్రపంచ నేత దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్‌ను గత ఫిబ్రవరి 23న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈడీ రిమాండ్ ఈరోజుతో ముగియనుండటంతో ఆయనను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. రిమాండ్‌ పొడిగించాలని ఈడీ కోరకపోవడంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపింది. దీనికి ముందు ఆయనకు ముంబైలోని జేజే ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు.


దావూద్ ఇబ్రహీం పైన, మరి కొందరిపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో దాని ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నవాబ్ మాలిక్ కస్టడీని ఇంతకుముందు మార్చి 7వ తేదీ వరకూ పీఎంఎల్ఏ కోర్టు పొడిగించింది.

Updated Date - 2022-03-07T20:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising