ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటలుగా జైలులో ఆహారం ముట్టుకోని Sidhu

ABN, First Publish Date - 2022-05-22T02:06:50+05:30

మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష ఎదుర్కొంటున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష ఎదుర్కొంటున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలు (Patiala jail)లో ఉన్నారు. అప్పుడే ఆయన జైలుకెళ్లి 24 గంటలు గడిచిపోయాయి. అయితే, ఆయన జైలుకి వెళ్లిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ తెలిపారు. శుక్రవారం రాత్రి కోర్టులో లొంగిపోయిన తర్వాత సిద్ధూను జైలుకు తరలించారు. అక్కడాయనకు 241383 నంబరు కేటాయించారు.

 

జైలు అధికారులు రాత్రి భోజనం వడ్డించగా అరోగ్య పరమైన కారణాలతో తినేందుకు సిద్ధూ నిరాకరించినట్టు వర్మ తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని అందించాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించాలని పాటియాలా కోర్టును అభ్యర్థించారు. అయితే ఆయన విజ్ఞప్తిపై అధికారుల నుంచి  ఇప్పటి వరకు స్పందన లేదు. జైలు అధికారులు వస్తారని ఉదయం నుంచి తాను కోర్టులోనే ఉన్నానని, అయినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-05-22T02:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising