ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌కు మద్దతివ్వడానికి రెడీ.. నాటో సెక్రటరీ జనరల్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-04-29T00:58:54+05:30

కీవ్: RUSSIAపై యుద్ధంలో UKRAINకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు NATO కీలక ప్రకటన చేసింది. యుద్ధం కొన్నేళ్లపాటు కొనసాగినా ఉక్రెయిన్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: RUSSIAపై యుద్ధంలో UKRAINకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు NATO కీలక ప్రకటన చేసింది. యుద్ధం కొన్నేళ్లపాటు కొనసాగినా ఉక్రెయిన్‌కు దన్నుగా నిలుస్తామని NATO ALLIANCE సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్  గురువారం ప్రకటన చేశారు. నాటో ప్రమాణాలతో కూడిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించేందుకు కూటమి సమాయత్తమవుతోందని ఆయన వివరించారు. పాత సోవియట్ కాలం నాటి WEAPONS నుంచి అధునాత పాశ్చాత్య మిలిటరీ పరికరాలు సమకూర్చే విషయంలో ఉక్రెయిన్‌కు సాయం అందిస్తామని స్పష్టం చేశారు. దీర్ఘకాలంపాటు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. UKRAIN - RUSSIA WAR కొన్ని నెలలపాటు లేదా ఏళ్లపాటు కొనసాగేందుకు ఖచ్చితంగా అవకాశాలున్నాయని స్టోల్టెన్‌బెర్గ్ అంచనా వేశారు. బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ యూత్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. 


ఉక్రెయిన్‌పై MILLITARY ACTIONలో ఇతర దేశం జోక్యం చేసుకుంటే రష్యా నుంచి తక్షణ మిలిటరీ స్పందన ఉంటుందని RUSSIA PRESIDENT VLADIMIR PUTIN ఇదివరకే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాటో కూటమి సెక్రటరీ జనరల్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్ గురువారం ఉక్రెయిన్ సందర్శనకు వెళ్లారు. కీవ్ నగరంలో ఆయన పర్యటించారు.

Updated Date - 2022-04-29T00:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising