ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ నో-ఫ్లైన్ జోన్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన నాటో

ABN, First Publish Date - 2022-03-05T01:49:36+05:30

క్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నాటో నుంచి నిరాశ ఎదురైంది. రష్యా వైమానిక దాడులను నిలువరించేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నాటో నుంచి నిరాశ ఎదురైంది. రష్యా వైమానిక దాడులను నిలువరించేందుకు 'నో-ఫ్లై జోన్' విధించాలని జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తిని నాటో దేశాలు తోసిపుచ్చాయి. నాటో విదేశాంగ మంత్రులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. నో-ఫ్లై విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌లోకి పంపాల్సి ఉంటుందని, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో ఫ్లైజ్ విధించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. యూరోప్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి ముగింపు పలకాల్సి వచ్చినప్పుడే అలా చేయాల్సి ఉంటుందన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజల బాధలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.


ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా వీడియోలింక్ ద్వారా కీవ్ నుంచి మాట్లాడుతూ, వ్యవహారం చేయి దాటిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌ను మరో సిరియాగా పుతిన్ మార్చకముందే ఆ పని చేయాలన్నారు. యుద్ధానికి వెనుకాడేది లేదని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని, అయితే తమకు భాగస్వాముల నుంచి శీఘ్ర సహకారం, తక్షణ చర్యలు అనివార్యమని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేష్ మూసివేయడం ఇష్టం లేకపోతే కనీసం రష్యా దాడులను తిప్పికొట్టేందుకైనా యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం వంటివి సరఫరా చేయాలని కులెబా కోరారు.

Updated Date - 2022-03-05T01:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising