ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్గి రాజేసిన నాన్సీ

ABN, First Publish Date - 2022-08-04T10:57:57+05:30

అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన తైవాన్‌లో అగ్గి రాజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తైవాన్‌ గగనతలంలోకి చైనా ఫైటర్‌ జెట్లు
  • మా పోర్టులు, పట్టణాలకు ముప్పు: తైవాన్‌
  • భయపడి తైవాన్‌ను వదిలేయలేం: పెలోసీ

తైపీ, ఆగస్టు 3: అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన తైవాన్‌లో అగ్గి రాజేసింది. చైనా నుంచి 27 యుద్ధ విమానాలు బుధవారం తైవాన్‌ గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయి. తైవాన్‌ చూట్టూ ఆరు ప్రాంతాల్లో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు విధ్వంసకర సైనిక విన్యాసాలను చేపట్టనున్నట్టు చైనా ప్రకటించింది. దీంతో తమ నౌకాశ్రయాలు, పట్టణ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉన్నట్టు తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, 2.3 కోట్ల తైవాన్‌ ప్రజలు తల వంచే ప్రసక్తే లేదని ఆ దేశం ప్రకటించింది. మరోవైపు తైవాన్‌ నుంచి చేపలు, సిట్రస్‌ ఫలాలు, తేనె, తేయాకు తదితర కీలకమైన దిగుమతులను చైనా నిషేధించింది. తైవాన్‌కు ఇసుక ఎగుమతిని కూడా చైనా నిలిపివేసింది. ఇదిలా ఉండగా, తైవాన్‌ అధ్యక్షురాలు ట్సాయ్‌ ఇంగ్‌-వెన్‌తో పెలోసీ బుధవారం సమావేశమయ్యారు. చైనా బెదిరింపులకు భయపడి, తైవాన్‌ విషయంలో తమ నిబద్ధతను వీడేది లేదని ఈ సందర్భంగా నాన్సీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం పెలోసీ బృందం తైవాన్‌ నుంచి దక్షిణ కొరియాకు పయనమైంది. 


మేం తలొగ్గం: తైవాన్‌

చైనాకు తాము తలొగ్గేది లేదని తైవాన్‌ అధ్యక్షురాలు ట్సాయ్‌ ఇంగ్‌-వెన్‌ స్పష్టం చేశారు. తైవాన్‌ పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది ప్రొపీషియస్‌ క్లౌడ్స్‌’తో పెలోసీని సత్కరించారు.  కాగా, పెలోసీ పర్యటనపై బీజింగ్‌లోని అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌కు చైనా సమన్లు పంపించింది. 

Updated Date - 2022-08-04T10:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising