ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నానా పటోలే ‘వీధి కుక్క’: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-24T22:25:39+05:30

నేను రాజకీయాల్లో 30 ఏళ్లుగా ఉన్నాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను ఇప్పటి వరకు ఎవరిపై పక్షపాతం చూపించలేదు. ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదు. ఎలాంటి బేధం లేకుండా నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సహాయం చేశాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల రాజకీయం తారా స్థాయికి చేరుతోంది. ఇప్పటికే ఎన్సీపీ, బీజేపీ, శివసేన మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కాగా, తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ నానా పటోలే ‘వీధి కుక్క’ అంటూ పూణె బీజేపీ చీఫ్ జగ్దీష్ ములిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడున్న వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓడించేవాడిని, కొట్టేవాడిని అంటూ నానా పటోలే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి జగ్దీష్ పై విధంగా వ్యాఖ్యానించారు.


‘‘నానా పటోలే ఒక వీధి కుక్క. ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి మొరుగుతూనే ఉంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుక్క మొరుగుతుంది అంటే అంతకు మించి వేరే ఇంకేం చేయలేకే అలా మొరుగుతుందని అర్థం. నానా పటోలే వ్యాఖ్యలు కూడా అలాంటివే. నానా, మిమ్మల్ని ఓడించడానికి మేమేం అక్కర్లేదు. మా కార్యకర్తలే మిమ్మల్ని ఓడిస్తారు’’ అని జగ్దీష్ అన్నారు.


దీనికి ముందు ప్రధాని మోదీని ఉద్దేశించి పటోలే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భండారా జిల్లాలోని ఓ కార్యక్రమంలో పటోలే మాట్లాడుతూ ‘‘నేను రాజకీయాల్లో 30 ఏళ్లుగా ఉన్నాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను ఇప్పటి వరకు ఎవరిపై పక్షపాతం చూపించలేదు. ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదు. ఎలాంటి బేధం లేకుండా నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. మోదీని ఓడించగలను, కొట్టగలను’’ అని పటోలే అన్నారు. అయితే ఈ వీడియో అంత స్పష్టంగా లేదని కొందరు అంటున్నారు.

Updated Date - 2022-01-24T22:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising