ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UttarPradeshలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై నమాజ్ నిలిచిపోయింది...సీఎం యోగి వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-23T16:43:17+05:30

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సీఎం యోగి సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని సీఎం పేర్కొన్నారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్, అల్విదా జుమా సందర్భంగా నమాజ్‌ను రోడ్డుపై నిర్వహించలేదు’’ అని యోగి అన్నారు.గతంలో ముజఫర్‌నగర్‌, మీరట్‌, మొరాదాబాద్‌ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే గత ఐదేళ్లలో అల్లర్లు జరగలేదన్నారు.


‘‘మా ప్రభుత్వం రాష్ట్రంలోని అక్రమ కబేళాలను మూసివేసింది. గోవులను సురక్షితంగా ఉంచడానికి మేం రాష్ట్రంలో గోశాలలను నిర్మించాం. మేం మతపరమైన ప్రదేశాల్లోని లౌడ్ స్పీకర్లను కూడా తొలగించాం. మా ప్రభుత్వం 700 కంటే ఎక్కువ మతపరమైన స్థలాలను పునర్నిర్మించింది’’ అని యోగి వివరించారు.


Updated Date - 2022-05-23T16:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising