ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WHO ALERT : చిన్నపిల్లల్లో అంతుచిక్కని వ్యాధి

ABN, First Publish Date - 2022-04-27T22:17:50+05:30

జెనీవా : 1 నెల పసికందు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు అంతుచిక్కని తీవ్ర వైరల్ హెపటైటిస్ వ్యాధి సోకుతోంది. ఎలా సోకుతుందో అర్థంకాని ఈ వైరల్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా : 1 నెల పసికందు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు సోకుతున్న అంతుచిక్కని తీవ్ర వైరల్ హెపటైటిస్ వ్యాధి కలవరానికి గురిచేస్తోంది. ఏవిధంగా సోకుతుందో అర్థంకాని ఈ వ్యాధిని ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వ్యాధి సోకిన పిల్లల్లో కామెర్లు, అతిసారం, వాంతులు, పొత్తికడుపు నొత్తి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. USA, UK లతోపాటు మరో 10 దేశాల్లోని పిల్లలకు ఈ తీవ్ర వ్యాధి సోకిందని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఒక చిన్నారి ప్రాణాలు వదలగా 12కు పైగామంది పిల్లలకు కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చిందని WHO ప్రకటించింది. కాలేయ వాపుకు కారణమవుతున్న ఈ వ్యాధి దేని ద్వారా సంక్రమిస్తుందో గుర్తించేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 169 మంది పిల్లల్లో ఈ వ్యాధిని గుర్తించారు. ఏప్రిల్ 21 నాటికి ఈ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సాధారణ కారణాలు ఈ వైరల్ హెపటైటిస్‌ కారణం కాదని తెలిపింది.


అయితే కేసుల సంఖ్య పెరుగుదలపై స్పష్టతలేదని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. కేసుల పెరుగుదల రేటు ప్రస్తుతం అంచనా వేసిన విధంగానే ఉంది. అయితే గుర్తించని కేసులు ఏమైనా ఉన్నాయో అనే సందేహం వెలిబుచ్చింది.  17 మంది పిల్లలు లేదా మొత్తంలో కేసుల్లో 10 శాతం మందికి కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఒక మరణం నమోదయ్యింది. ఈ వ్యాధికి కారణం ఏంటో కనుగొనేలోపే మరిన్ని కేసులు గుర్తించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో అంచనావేసింది. కారణం తెలిస్తే ముందస్తు జాగ్రత్త, నియంత్రణ చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 


వ్యాధిబారినపడ్డ అధిక పిల్లల్లో అడెనో జాతి వైరస్‌ను గుర్తించారు. అడెనో వైరస్ కారణంగా సాధారణ జలుబుతో అనారోగ్యానికి గురవుతుండడం చూస్తుంటాం. కానీ అంతుచిక్కని ఈ వ్యాధిలో ఇవేమీ కనిపించలేదు.  సాధారణ వైరస్‌లలో హెపటైటిస్ వైరస్‌లు ఏ, బీ, సీ, డీ, ఈ ఉంటాయి. అడెనో వైరస్ కారణంగానే ఈ తీవ్ర హెపటైటిస్‌ సోకుతోందని భావిస్తే.. ఇందుకు కారణమవుతున్న వాహకం ఏంటనేదానిపై అధ్యయనాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా ఈ వైరస్ ఏమైనా వ్యాపిస్తుందా అనే అంశంపై కూడా ఆధారాలేమీ దొరకలేదు. 


డబ్ల్యూహెచ్‌వో డేటా ప్రకారం.. ఏప్రిల్ 5 నాటికి సెంట్రల్ స్కాట్‌లాండ్‌లో 10 కేసులు నమోదయ్యాయి. గతంలో ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లోనే ఈ వ్యాధిని గుర్తించారు.  ఇక  ఏప్రిల్ 21 నాటికి యూకేలో మొత్తం 114 కేసులు గుర్తించారు. ఆ తర్వాత స్పెయిన్‌లో 13, ఇజ్రాయెల్‌లో 12, అమెరికాలో 9, ఆ తర్వాత డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నార్వే, ఫ్రాన్స్, రొమేనియా, బెల్జియం దేశాల్లో మరో 21 కేసులను గుర్తించారు.

Updated Date - 2022-04-27T22:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising