ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mysore Dussehra Festivals: మైసూరు అంబారీకి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-10-07T17:21:18+05:30

మైసూరు దసరా ఉత్సవాల్లో కీలక ఘట్టమైన అంబారీ వేడుక బుధవారం కనుల పండువగా జరిగింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Chief Mi

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాల్లో కీలక ఘట్టమైన అంబారీ వేడుక బుధవారం కనుల పండువగా జరిగింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Chief Minister Basavaraja Bommai)తో పాటు యువరాజు యదువీర, జిల్లా ఇన్‌చార్జిమంత్రి సోమశేఖర్‌ ఈ సందర్భంగా అంబారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి ఈసారి లక్షలాది మంది ప్రజలు మైసూరు దసరా అంబారిని తిలకించేందుకు తరలిరావడంతో రాజనగరి జనసంద్రాన్ని తలపించింది. మైసూరు నుండి బెంగళూరు చేరుకునేందుకు సాధారణంగా నాలుగైదు గంటల సమయం పడుతుంటుంది. అలాంటిది గురువారం మాత్రం పది నుండి పన్నెండు గంటలకు పైగా సమయం పట్టింది. ట్రాఫిక్‌ తీవ్రతకు ఇది ఉదాహరణ మాత్రమే. కాగా ఈసారి దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని పది లక్షల మందికి పైగా ప్రజలు వీటిని తిలకించారని ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించామని ఇందుకు సహకరించిన అధికారులు, ప్రజలకు జిల్లా ఇన్‌చార్జిమంత్రి ఎసటీ సోమశేఖర్‌ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-10-07T17:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising