ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Invitation: మైసూరు దసరా ఉత్సవాలకు రండి

ABN, First Publish Date - 2022-09-22T17:43:41+05:30

ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల(Mysore Dussehra Festivals)కు హాజరు కావాలని విజ్ఞప్తిచేస్తూ ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - సీఎం, స్పీకర్‌కు అధికారిక ఆహ్వానం


బెంగళూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల(Mysore Dussehra Festivals)కు హాజరు కావాలని విజ్ఞప్తిచేస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు అధికారిక ఆహ్వానాన్ని బుధవారం అందజేశారు. మైసూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌, సీఎంకు మైసూరు సంప్రదాయ తలపాగా, శాలువా, పండ్లబుట్టతో పాటు ఆహ్వానపత్రికు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి గోవింద కార్జోళ, ఎమ్మెల్యే ఎల్‌.నాగేంద్ర, ఎమ్మెల్సీ సీఎన్‌మంజెగౌడ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బగాది గౌతమ్‌, దసరా స్వాగత ఉపసమితి కార్యాధ్యక్షుడు రూప ఎం.జె తదితరులు హాజరయ్యారు. ఈసారి మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించిన సంగతి విదితమే. దసరా ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)ని ఆహ్వానించామని పీఎంఓ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరిని కూడా దసరా ఉత్సవాలకు అధికారికంగా ఆహ్వానించారు.

Updated Date - 2022-09-22T17:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising