ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్యాల పల్లకీలో సీతమ్మ విహారం

ABN, First Publish Date - 2022-04-10T16:21:00+05:30

స్థానిక కొడుంగైయూర్‌ తిరువళ్లువర్‌నగర్‌లోని సీతారామ కల్యాణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 14 రోజుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం భద్రాచలం జరిగే విధంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - గోటి తలంబ్రాలు సిద్ధం చేసిన ముత్తయిదువులు


ప్యారీస్‌(చెన్నై): స్థానిక కొడుంగైయూర్‌ తిరువళ్లువర్‌నగర్‌లోని సీతారామ కల్యాణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 14 రోజుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం భద్రాచలం జరిగే విధంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు సమితి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. సీతారాముల కల్యాణానికి అవసరమైన అక్షింతలను వారం రోజుల రామ దీక్ష చేపట్టిన ముత్తయిదువులు శుక్రవారం రాత్రి  వడ్లను గోటితో ఒలిచి బియ్యంగా మార్చి తలంబ్రాలుగా సిద్ధం చేశారు. అనంతరం సీతమ్మవారికి మంగళ స్నానం అనంతరం విశేషాలంకరణ సేవలను భాస్కర పంతుల బృందం నిర్వహించింది. సమితి సభ్యులైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ కల్యాణ సేవా సమితి ట్రస్ట్‌ నిర్వాహకులు పి.మధుమతి రామచంద్రన్‌, వి.రామయ్య శెట్టి, బి.రమేష్‌, మొలగనూరు విజయ్‌కుమార్‌, మంజుల మధుబాబు, బి.దయాకర్‌, జి.లావణ జయప్రకాష్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-04-10T16:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising