ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింలు దేవాలయాలను లాక్కున్నారు...Gyanvapi masgidపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-06-04T15:56:45+05:30

జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్): జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ముస్లింలు దేవుడిని మోసం చేసి హిందువులకు చెందిన అన్ని దేవాలయాలను లాక్కున్నారు’’ అని రామ్ సూరత్ రాయ్ ఆరోపించారు.ముస్లింలు తమ ఇంటికి వచ్చిన హిందువులకు ఇస్లామిక్ టోపీ పెట్టి స్వాగతం పలుకుతారనే ఉదాహరణను ఉటంకిస్తూ, అదే విధంగా ముస్లింలు దేవుళ్లను (భగవాన్ కో టోపీ పెహనా దియా) మోసం చేశారని, దేవాలయాలన్నింటిని లాక్కుని మసీదులను నిర్మించారని రామ్ సూరత్ రాయ్ అన్నారు. 


‘‘ఈ రోజు దేవుడు భూమి కింద నుంచి ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాడు. ఎక్కడో రాధా కృష్ణ రూపంలో, ఎక్కడో శివుని రూపంలో, ఎక్కడో రాముని రూపంలో కనిపిస్తున్నాడు’’అని రామ్ సూరత్ రాయ్ అన్నారు.జ్ఞానవాపి మసీదు భూమి హిందువులకు చెందినది కాబట్టి ముస్లింలు రాబోయే రోజుల్లో ఆ భూమిని స్వయంగా వదులుకోవలసి ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-06-04T15:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising