ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింల నిరసనలతో రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌

ABN, First Publish Date - 2022-06-11T16:46:38+05:30

మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యానించిన నుపుర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ను తక్షణం అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - డీజీపీ, ఎస్పీలను అప్రమత్తం చేసిన సీఎం


బెంగళూరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యానించిన నుపుర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ను తక్షణం అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నిరసనల నేపథ్యంలో కర్ణాటకలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, డీజీపీ ప్రవీణ్‌సూద్‌తోపాటు జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు. ముందస్తు అనుమతులు తీసుకున్నవారు ప్రశాంతంగా నిరసనలు తెలిపేందుకు మాత్రమే అవకాశం ఇవ్వాలని, రెచ్చగొట్టేవారిపై, అశాంతి సృష్టించేవారిపై డేగకన్ను విధించాలని సీఎం సూచించారు. ఢిల్లీతో సహా దేశంలోని పలు నగరాలలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం నిరసనలు చేపట్టారు. కొన్నిచోట్ల ఇవి హింసాకాండకు దారితీయడంలో కర్ణాటకలో ముందస్తుగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో హిజాబ్‌, అజాన్‌ వంటి వివాదాల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. కాగా సచివాలయంలో ఏడీజీపీ అలోక్‌కుమార్‌ అధ్యక్షతన పోలీసు అధికారుల కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రతా్‌పరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలోని చిక్కమగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో ముస్లింలు నిరసన చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి భద్రతను ఏర్పాటు చే శామని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ మీడియాకు తెలిపారు. 

Updated Date - 2022-06-11T16:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising