ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లిం ఫకీర్లపై వేధింపులు.. జై శ్రీరాం అనిపిస్తూ..

ABN, First Publish Date - 2022-06-09T21:39:01+05:30

గోండా ప్రాంతంలోని డెగూరు అనే గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియో ప్రకారం.. భిక్షటనకు వచ్చిన ముగ్గురు ఫకీర్లను కొద్ది మంది యువకులు ఆపారు. వారి మతాన్ని ప్రస్తావిస్తూ బూతులు తిట్టడం ప్రారంభించారు. డబ్బులు కలెక్ట్ చేసుకుని బిర్యాణి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఒకవైపు ఉడికిపోతుంటే అదే రాష్ట్రంలో మరోవైపు ముస్లిం ఫకీర్లపై వేధింపులు తాజాగా వెలుగు చూశాయి. పొట్టకూటి కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఫకీర్లను పట్టుకుని జిహాదీలు, టెర్రరిస్టులు అంటూ దూషణకు దిగారు. అంతే కాకుండా ఒక వ్యక్తైతే కర్రతో వచ్చి వారి చేత బలవంతంగా ‘జై శ్రీరాం’ నినాదాలు చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


గోండా ప్రాంతంలోని డెగూరు అనే గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియో ప్రకారం.. భిక్షటనకు వచ్చిన ముగ్గురు ఫకీర్లను కొద్ది మంది యువకులు ఆపారు. వారి మతాన్ని ప్రస్తావిస్తూ బూతులు తిట్టడం ప్రారంభించారు. డబ్బులు కలెక్ట్ చేసుకుని బిర్యాణి తింటారని, జిహాదీలని, టెర్రరిస్టులని దూషించారు. అంతే కాకుండా వారిని ఐడీ కార్డులు చూపించమంటూ ఇబ్బందికి గురి చేశారు. యువకుల్లో నుంచి ఒక వ్యక్తి వారిని కొట్టండని పలుమార్లు అన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి కర్రతో అక్కడికి వచ్చి జై శ్రీరాం నినాదాలు చేయించాడు. అదే సమయంలో వారితో గుంజీలు తీయించాడు.

Updated Date - 2022-06-09T21:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising