ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai: హోటల్ గదిలో ఉరేసుకున్న మోడల్..సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?

ABN, First Publish Date - 2022-09-30T23:17:39+05:30

మోడలింగ్ రంగంలో ఆటుపోటులు చవిచూసిన 30 ఏళ్ల ముంబై మోడల్ అర్థాంతరంగా జీవితాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై:  మోడలింగ్ రంగంలో ఆటుపోటులు చవిచూసిన 30 ఏళ్ల ముంబై మోడల్ (mumbai model) అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది. అంథేరి శివార్లలోని వెర్సోవాలో ఉన్న ఓ హోటల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్యాహత్య (suicide) చేసుకుంది. మృతురాలిని ఆకాంక్ష మోహన్ (Akanksha mohan)గా గుర్తించారు. ఘటనా స్థలి నుంచి సూసైట్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు శుక్రవారంనాడు తెలిపారు. తాను హ్యాపీగా లేనని, ప్రశాంతత కోరుకుంటున్నాంటూ ఆ నోట్‌లో ఆకాంక్ష మోహన్ తెలిపింది.


''లోఖండ్వాలా ఏరియాలోని యమునా నగర్ సొసైటీలో ఆకాంక్ష నివాసముంటోంది. మోడల్‌గా స్థిరపడేందుకు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హోటల్‌లో రూమ్‌ అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత నుంచి లోపల తలుపులు వేసుకుని ఉండిపోయింది. సిబ్బంది తలుపుతట్టినప్పటికీ సమాధానం రాకపోవడంతో ఆ సమాచారాన్ని పోలీసులకు హోటల్ మేనేజర్ తెలియజేశారు. పోలీసు టీమ్ అక్కడికి చేరుకుని తలుపులు పగులుగొట్టి లోపలకు వెళ్లగా ఫ్యానుకు ఉరేసుకున్న మోడల్ మృతదేహం కనిపించింది'' అని వర్సోవా పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తన చావుకు ఎవ్వరూ బాధ్యులు కాదని, తాను సంతోషంగా లేనని, కేవలం ప్రశాంతత కోరుకుంటున్నానని నోట్‌లో ఉన్నట్టు ఆయన చెప్పారు. యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు  చెప్పారు.


Updated Date - 2022-09-30T23:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising