ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RS Polls: ఒక రోజు Bail కోరుతూ Nawab, Anil వేసిన Plea తిరస్కరణ

ABN, First Publish Date - 2022-06-09T22:16:50+05:30

ఒక రోజు బెయిల్(bail) కోరుతూ మాజీ మంత్రులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్(Nawab Malik), అనిల్ దేశ్‌ముఖ్‌(Anil Deshmukh)లు వేరు వేరుగా పెట్టుకున్న అభ్యర్థనలను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు(Rajya Sabha elections) శుక్రవారం జరగనున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఒక రోజు బెయిల్(bail) కోరుతూ మాజీ మంత్రులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్(Nawab Malik), అనిల్ దేశ్‌ముఖ్‌(Anil Deshmukh)లు వేరు వేరుగా పెట్టుకున్న అభ్యర్థనలను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు(Rajya Sabha elections) శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఒకరోజు బెయిల్‌ ఇవ్వాలని వారు ఇరువురు పిటిషన్ దాఖలు చేశారు. మాజీ హోంమంత్రి అయిన అనిల్ దేశ్‌ముఖ్ గత నవంబర్‌లో హవాలా కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) సన్నిహితులతో సంబంధాలతో పాటు పలు అవినీతి ఆరోపణలతో మైనారిటి శాఖ మాజీ మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ఇరువురు నేతల బెయిల్ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) వ్యతిరేకించింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం.. ఖైదీలు ఓటేసే అధికారం లేదని కోర్టు ముందు ఈడీ వాదించింది. నేరం రుజువైన వారికైనా లేదంటే నేరారోపణలతో విచారణ ఎదుర్కొంటున్న వారికైనా ఇది వర్తిస్తుందని ఈడీ పేర్కొంది.

Updated Date - 2022-06-09T22:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising