ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర మాజీ హోం మంత్రికి బెయిలు నిరాకరణ

ABN, First Publish Date - 2022-01-18T23:12:23+05:30

మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురైంది. ఆయన బెయిలు అభ్యర్థనను ముంబై ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఐపీసీ సెక్షన్ 167(2) కింద డిఫాల్ట్ బెయిల్‌ ఇవ్వాలని మాజీ మంత్రి కోరగా, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదించింది. అనిల్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నారు.


మనీ లాండరింగ్, రూ.100 కోట్ల మేరకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలపై గత ఏడాది నవంబర్ 1న అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్టు చేసింది. నెలనెలా హోటళ్లు, బార్ల యజమానుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను మాజీ హోం మంత్రి ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ ఆరోపించారు. దీనిపై పీఎంఎల్ఏ చట్టం కింద దేశ్‌ముఖ్ స్టేట్‌మెంట్‌ను దర్యాప్తు సంస్థ రికార్డు చేసింది.

Updated Date - 2022-01-18T23:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising