ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 ఏళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి .. కోర్ట్ తీవ్ర ఆగ్రహం

ABN, First Publish Date - 2022-04-19T01:22:40+05:30

ముంబై : ఒక కూతురికి తన తండ్రి శత్రుదుర్భేద్యమైన కోట లాంటివాడు, ధర్మకర్త అని ముంబై ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కూతురికి తన తండ్రి శత్రుదుర్భేద్యమైన కోట లాంటివాడు, ధర్మకర్త అని ముంబై ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాంటి కన్నతండ్రే కూతురిపై లైంగిక దాడికి పాల్పడడమంటే అతి జుగుస్సాకరమైనదని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 5 ఏళ్ల బాలికపై తండ్రి లైంగిక హింస కేసు విచారణలో భాగంగా ముంబై పోస్కో కోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిని దోషిగా తేల్చి సోమవారం తీర్పునిచ్చింది. బాలిక ప్రైవేటు భాగాలను తాకలేదంటూ తండ్రి తరపున లాయర్ వినిపించిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇలాంటి వాదనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని మండిపడింది. ప్రైవేటు భాగాలను తాకితేనే లైంగిక దాడి అని పోస్కో చట్టం పేర్కొనలేదు. ఏయే భాగాలను ఎంతవరకు తాకాలనేదానిని చెప్పలేదు. అయినా ఇలాంటి వాదనలు చేయడం ఏంటని కోర్ట్ మందలించింది. దోషిగా లేలిన తండ్రికి 5 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి హెచ్‌సీ షిండే తీర్పునిచ్చారు. దోషి దురుద్దేశ్యంతోనే బాలికను తాకాడు. అందుకే బాలిక ప్రవర్తనపై ప్రభావం పడిందని న్యాయమూర్తి అన్నారు. 


బాలిక ప్రవర్తనలో మార్పుతో వెలుగులోకి..

జనవరి 2019లో ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన స్కూల్ టీచర్ విషయాన్ని బాలిక తల్లికి తెలియజేశారు. కూతురిని ప్రశ్నించిన తల్లి అసలు విషయం తెలుసుకుంది. కన్నతండ్రే బాలిక ఒంటిపై చేతులు వేస్తున్నాడని గుర్తించింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఎలాంటి తప్పుచేయలేదని, బాలిక ప్రైవేటు భాగాలను తాకలేదని తండ్రి బుకాయించాడు. తనను విడిచిపెట్టాలనుకుంటున్న తన భార్య ఈ నిందలు వేస్తోందని చెప్పుకొచ్చాడు. కానీ చివరికి పాపం జైలుపాలయ్యాడు.

Updated Date - 2022-04-19T01:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising