ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలీవుడ్ స్టార్ మాజీ బాడీగార్డ్, ముంబై పోలీసు సస్పెన్షన్

ABN, First Publish Date - 2022-02-17T14:25:20+05:30

ప్రభుత్వ సర్వీసు రూల్స్ ను ఉల్లంఘించి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డుగా పనిచేసిన ముంబై హెడ్ కానిస్టేబుల్ జితేంత్ర నారాయణ్ షిండేను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రభుత్వ సర్వీసు రూల్స్ ను ఉల్లంఘించి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డుగా పనిచేసిన ముంబై హెడ్ కానిస్టేబుల్ జితేంత్ర నారాయణ్ షిండేను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు.ముంబై పోలీసు హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర నారాయణ్ షిండే 2015 వ సంవత్సరం నుంచి 2021 వరకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బాడీగార్డుగా పనిచేశారని దర్యాప్తులో తేలింది. హెడ్ కానిస్టేబుల్ సర్వీసు రూల్స్ ను ఉల్లంఘించారని ఫిర్యాదులు రావడంతో అతన్ని డీబీ మార్గ్ పోలీసుస్టేషనుకు బదిలీ చేశారు. జితేంద్ర నారాయణ్ బాలీవుడ్ స్టార్ తో పనిచేసినపుడు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా నాలుగుసార్లు విదేశాలకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.బాడీగార్డుగా షిండే ఏడాదికి రూ.1.5కోట్లు సంపాదించినట్లు వెల్లడైంది.


దీంతోపాటు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే మూడుసార్లు ఇళ్లు కొని విక్రయించాడని అదనపు కమిషనర్ దిలీప్ సావంత్‌ దర్యాప్తులో తేలింది.దీంతో జితేంద్ర నారాయణ్ ను పోలీసు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ముంబై పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2022-02-17T14:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising