ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్యామ్‌ ఇంజనీర్లకు శాటిలైట్‌ ఫోన్లు

ABN, First Publish Date - 2022-06-05T16:04:54+05:30

ముల్లై - పెరియార్‌ డ్యామ్‌ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శాటిలైట్‌ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర నీటివనరుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ముల్లై - పెరియార్‌ డ్యామ్‌ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శాటిలైట్‌ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర నీటివనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.9.50లక్షలతో కొనుగులు చేసిన ఆరు శాటిలైట్‌ ఫోన్లను ఆ డ్యామ్‌ వద్ద పనిచేస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, పెరియార్‌ డ్యామ్‌ క్యాంపు, తేక్కడి క్యాంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన ముల్లై పెరియార్‌ డ్యామ్‌ దట్టమైన పెరియార్‌ పులుల అభయారణ్యం నడుమ ఉందని, ఆ ప్రాంతంలో ల్యాండ్‌ లైన్‌ టెలిఫోన్లు, మొబైల్‌ ఫోన్లు సక్రమంగా పనిచేయవని, ఈ ఇబ్బందులను గమనించే డ్యాం వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లకు శాటిలైట్‌ ఫోన్లు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు నీటివనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ సక్సేనా, చీఫ్‌ ఇంజనీర్‌ కే రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-05T16:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising