ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములాయం సింగ్‌కు షాక్.. బీజేపీలో చేరిన అత్యంత సన్నిహితుడు

ABN, First Publish Date - 2022-01-31T22:32:48+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) మాజీ నేత, ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన శివకుమార్ బేరియా నేడు బీజేపీలో చేరారు. సమాజ్‌వాదీ ప్రభుత్వ హయాంలో బేరియా మంత్రిగానూ పనిచేశారు. కాగా, ఎస్‌పీ ఎమ్మెల్సీ రమేశ్ మిశ్రా కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. 


మరోవైపు, ఈ నెల 13న ఎస్‌పీలో చేరిన బీజేపీ ధౌరారా ఎమ్మెల్యే తిరిగి బీజేపీ గూటికి చేరారు. ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరిన అనంతరం ఈ వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2017 ఎన్నికల్లో ఎస్‌పీ టికెట్‌పై లక్నో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణపై పోటీ చేసి 33,796 ఓట్ల తేడాతో అపర్ణ ఓటమి పాలయ్యారు.


అలాగే, మాజీ ఎమ్మెల్యే, ములాయంసింగ్ యాదవ్ బావమరిది ప్రమోద్ గుప్తా కూడా ఈ నెల 20న కాషాయ కండువా కప్పుకున్నారు. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. 

Updated Date - 2022-01-31T22:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising