ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీ స్టార్ క్యాంపెయినర్లలో ములాయం, జయాబచ్చన్

ABN, First Publish Date - 2022-01-23T18:41:16+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ తరహాలోనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ తరహాలోనే 30 మంది స్టార్ క్యాంపెయినర్లను తొలి విడత ఎన్నికల ప్రచార బరిలోకి దింపింది. పార్టీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ములాయం కోడలు డింపుల్ యాదవ్, పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్, ఎమ్మెల్యే స్వామి ప్రసాద్ మౌర్య తదితరులు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.


కాగా, అఖిలేశ్‌ యాదవ్‌ మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఒక్కసారిగా యూపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎస్పీకి కంచుకోట అయిన మైన్‌పురీ జిల్లాలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. దేశంలో కొన్ని ప్రాంతా ల్లో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్‌ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) ఈ నెల 31 వరకు పొడిగించింది. అయితే, ఫిబ్రవరి 10న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి, 14న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో పాల్గొనేవారి సంఖ్యను సెక్యూరిటీ సిబ్బంది కాకుండా 5 నుంచి 10కి పెంచింది.

Updated Date - 2022-01-23T18:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising