ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈశ్వరప్పపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి

ABN, First Publish Date - 2022-02-22T20:15:51+05:30

ఎర్రకోటపై కేసరి బావుటాను ఎగురవేస్తామని చెప్పిన మంత్రి ఈశ్వరప్పపై దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ జిల్లా విభాగం నగరంలో సోమవారం ఆందోళన చేపట్టింది. నగరంలోని గడిగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    -  రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుసేన్‌


బళ్ళారి(కర్ణాటక): ఎర్రకోటపై కేసరి బావుటాను ఎగురవేస్తామని చెప్పిన మంత్రి ఈశ్వరప్పపై దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ జిల్లా విభాగం నగరంలో సోమవారం ఆందోళన చేపట్టింది. నగరంలోని గడిగి చెన్నప్ప సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ఆందోళన జిల్లా అధికారి కార్యాలయం వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఈశ్వరప్పకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారి పవన్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుసేన్‌ మాట్లాడుతూ శివమొగ్గలో జాతీయ జెండాను ఎగురవేయడానికి మంతి మద్దతు పలకడం సరికాదని, ఇది దేశద్రోహిగా పరిగణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ముండరిగి నాగరాజు, కాంగ్రెస్‌ నాయకులు కల్లుకంబ పంపాపతి, జేఎస్‌ ఆంజనేయులు, వెంకటరమణ, అయాజ్‌ అహ్మద్‌, వెంకటేష్‌ హెగడే, జగన్‌, తాయప్ప, విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-22T20:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising