ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Kanimoli: నూతన విద్యా విధానానికి డీఎంకే వ్యతిరేకం

ABN, First Publish Date - 2022-10-03T15:53:05+05:30

కేంద్రప్రభుత్వ నూతన విద్యా విధానానికి డీఎంకే వ్యతిరేకమని ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు కనిమొళి(Kanimoli) స్పష్టం చేశారు. చెన్నై తూర్పు జిల్లా డీఎంకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                               - ఎంపీ కనిమొళి


ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 2: కేంద్రప్రభుత్వ నూతన విద్యా విధానానికి డీఎంకే వ్యతిరేకమని ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు కనిమొళి(Kanimoli) స్పష్టం చేశారు. చెన్నై తూర్పు జిల్లా డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ఓటేరిలో శనివారం సాయంత్రం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పేద మహిళలకు సహాయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పీకే శేఖర్‌బాబు(State Minister PK Shekhar Babu), నగర మేయర్‌ ప్రియ, పార్లమెంటు సభ్యుడు కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యే తాయగం కవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కనిమొళి మాట్లాడుతూ, సంవత్సరమంతా కార్యక్రమాలు నిర్వహించే జిల్లా కార్యదర్శి మంత్రి శేఖర్‌బాబు మాత్రమేననని, ఆయన మంత్రి పదవిని, పార్టీ పదవిని రెండు కళ్లుగా భావిస్తున్నారని కొనియాడారు. కులమతాల పేరుతో ప్రజలను చీల్చేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, నూతన విద్యా విధానాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.  అన్ని వర్గాల ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడమే డీఎంకే ద్రావిడ తరహా పాలన ముఖ్యోద్దేశమని కనిమొళి అన్నారు

Updated Date - 2022-10-03T15:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising