ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Traffic police warning: వర్షం కురుస్తున్నపుడు వంతెనలు,అండర్‌పాస్‌ల కింద ద్విచక్ర వాహనాలు ఆపితే...జరిమానా

ABN, First Publish Date - 2022-09-02T18:46:23+05:30

వర్షం కురుస్తుందని మీ ద్విచక్ర వాహనాన్ని బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల కింద ఆపుతున్నారా? అయితే జర జాగ్రత్త....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): వర్షం కురుస్తుందని మీ ద్విచక్ర వాహనాన్ని బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల కింద ఆపుతున్నారా? అయితే జర జాగ్రత్త ఇక నుంచి అలా వాహనాలను ఆపితే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు(fined) వడ్డిస్తారు(Traffic police warning)...ఇక నుంచి వర్షం కురుస్తున్నపుడు మీ ద్విచక్రవాహనాలను వంతెనలు, అండర్‌పాస్‌ల వద్ద  ఆపితే వాహనచోదకులకు(Motorists) రూ.500ల జరిమానా విధించాలని బెంగళూరు(Bengaluru) ట్రాఫిక్(traffic) పోలీసులు(police) తాజాగా నిర్ణయించారు. ఇలా తరచూ వంతెనలు, అండర్‌పాస్‌ల వద్ద (below underpasses or bridges) ద్విచక్రవాహనాలను ఆపే వారికి (repeat offenders) వెయ్యిరూపాయల జరిమానా వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.


పబ్లిక్ రోడ్లపై ద్విచక్రవాహనాలు నిలిపి అడ్డుకోవడం వల్ల, వాహనచోదకులను ప్రమాదంలో పడేస్తోంది. ఇలా వంతెనలు, అండర్‌పాస్‌ల వద్ద ద్విచక్రవాహనాలను ఆపినందువల్ల ఇటీవల 4 ప్రాంతాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం జాయింట్ కమిషనర్(Joint commissioner of police traffic) బీఆర్ రవికాంత్ గౌడ చెప్పారు.పలు అండర్‌పాస్‌ల వద్ద విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల వర్షం కురుస్తున్నపుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.


వర్షం కురుస్తున్నపుడు వాహనచోదకులు తమ ద్విచక్రవాహనాలను బస్ షెల్టర్ల సమీపంలో లేదా తడవకుండా తలదాచుకునే ప్రాంతాలున్న చోట ఆగాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వర్షం కురుస్తున్నపుడు వంతెనలు, అండర్‌పాస్‌ల వద్ద ద్విచక్రవాహనాలు ఆపకుండా నిరోధించేందుకు ట్రాఫిక్ పోలీసులను నియమిస్తున్నామని బెంగళూరు పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-09-02T18:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising