ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చన్నీని ఓడించిన ఆప్ ఎమ్మెల్యే తల్లి ఇప్పటికీ స్వీపరే

ABN, First Publish Date - 2022-03-13T21:58:16+05:30

చీపురు అనేది నా జీవితంలో అత్యంత ప్రధానమైన వస్తువు. అనుకోకుండా నా కొడుకు అదే గుర్తుపై గెలిచాడు. ముఖ్యమంత్రిపై పోటీ చేసినప్పుడే గెలుస్తాడని అనుకున్నాం. నా కొడుకును గెలిపించిన వారి కోసం పని చేస్తాడు. వారి కోసమే పని చేయాలి. మేము మాలాగే ఉంటాం00

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీని ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే లభ్ సింగ్ ఉగోక్ తల్లిపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఐకాన్ అని, ఎంతో మందికి ఆదర్శమని ఆకాశానికి ఎత్తుతున్నారు. కారణం.. కొడుకు ఎమ్మెల్యే అయినా ఆమె ఇప్పటికీ స్వీపర్‌గా పని చేస్తుండడం. ఆమె స్వీపర్‌గా పని చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఆప్ ఎమ్మెల్యే లభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అంతకు ముందు నుంచే ఆయన తల్లి బల్దేవ్ కౌర్ ఒక ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చన్నీపై లభ్ సింగ్ 37,550 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, శనివారం కూడా ఆయన తల్లి ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చి తన పని చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా ‘‘డబ్బు సంపాదించడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు నా కొడుకు ఏ స్థానంలో ఉన్నాడనేది అనవసరం. నా పనిని నేను వదులుకోను’’ అని సమాధానం ఇచ్చారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘చీపురు అనేది నా జీవితంలో అత్యంత ప్రధానమైన వస్తువు. అనుకోకుండా నా కొడుకు అదే గుర్తుపై గెలిచాడు. ముఖ్యమంత్రిపై పోటీ చేసినప్పుడే గెలుస్తాడని అనుకున్నాం. నా కొడుకును గెలిపించిన వారి కోసం పని చేస్తాడు. వారి కోసమే పని చేయాలి. మేము మాలాగే ఉంటాం. ఇంతకు ముందు ఏం చేశామో ఇప్పుడూ అదే చేస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2022-03-13T21:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising