ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హిందుత్వంపై ప్రతిపక్షాలే ఎక్కువ మాట్లాడుతున్నాయి’

ABN, First Publish Date - 2022-01-18T22:15:19+05:30

రెండు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన విధానాన్ని పుస్తకంలో రాసుకొచ్చినట్లు భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. కార్యకర్తల్ని పెంచుకుంటూ ప్రజల్లో బలాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మతం గురించి ప్రతిపక్షాలే ఎక్కువగా మాట్లాడుతున్నాయని, నిజానికి మతాన్ని రాజకీయం చేస్తున్నది ప్రతిపక్ష పార్టీలే అని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. జనసంఘ్ ప్రస్థానం నేటి వరకు భారతీయ జనతా పార్టీ ప్రస్థానం, ఎదుగుదలపై ‘ది రైజ్ ఆఫ్ ది బీజేపీ, ది మేకింగ్ ఆఫ్ ది లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ’ అనే పుస్తకాన్ని కేంద్ర మంత్రితో పాటు ఆర్థికవేత్త, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలిసీ విద్యా సంస్థ ప్రొఫెసర్ ఇలా పట్నాయక్ సంయుక్తంగా రాశారు. కాగా, ఈ పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.


రెండు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన విధానాన్ని పుస్తకంలో రాసుకొచ్చినట్లు భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. కార్యకర్తల్ని పెంచుకుంటూ ప్రజల్లో బలాన్ని, ఆదరణను బీజేపీ ఎలా పెంచుకోగలిగిందో అందులో వివరించినట్లు పేర్కొన్నారు. బీజేపీ స్పష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయని, అయితే మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీని నిందించే ప్రతిపక్ష పార్టీల నేతలే మతం, హిందుత్వం గురించి ఎక్కువగా మాట్లాడున్నారని ఆయన విమర్శించారు. అయితే ఈ పుస్తకంలో రాజకీయ విషయాలతో పాటు ఆర్థిక అంశాలపై కూడా విశ్లేషణ జరిగిందని మరో రచయిత అయిన ఇలా పట్నాయక్ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-18T22:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising