ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందకు పైగా యాప్‌లు.. వేల కోట్లు చైనాకు తరలింపు

ABN, First Publish Date - 2022-09-11T08:55:20+05:30

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో స్ర్కీన్‌ లాక్‌ ఉన్నప్పుడు.. అన్‌లాక్‌కు ప్రయత్నిస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో స్ర్కీన్‌ లాక్‌ ఉన్నప్పుడు.. అన్‌లాక్‌కు ప్రయత్నిస్తే.. అర్ధనగ్నంగా ఉండే అందమైన అమ్మాయి ఫొటోతో చాటింగ్‌ కోసం వచ్చే యాడ్స్‌ను గమనించారా? ఒక్కసారి అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. వారితో మాట్లాడడానికి నిమిషానికి రూ. 100, రూ. 200 చొప్పున రీచార్జ్‌ చేసుకోవాలి. మీరు చెల్లింపులు చేసినంత సేపు.. అవతల వీడియోకాల్‌లో ఉండే యువతులు, మహిళలు అలరిస్తుంటారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది?? కలర్‌ ప్రిడిక్షన్‌, నంబర్‌ ప్రిడిక్షన్‌.. ఇలా పలు పేర్లతో వస్తున్న గేమింగ్‌యా్‌పలో ముందుగా డబ్బులు చెల్లించాలి. ఆ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?? ఇవే కాదు.. దా‘రుణ’ యాప్‌లు వసూలు చేసే అధిక వడ్డీ.. బెట్టింగ్‌ యాప్‌లు వసూలు చేసే భారతీయుల సొమ్ము.. ఇలా మొత్తం చైనాకు తరలుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు స్పష్టం చేశారు. భారత్‌తో నేరుగా సైనిక శక్తితో తలపడలేక.. ఆర్థిక దోపిడీకి చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలా వందకు పైగా యాప్‌లువేల కోట్లను పేమెంట్‌ గేట్‌వేలు, హవా లా మార్గాల్లో చైనాకు తరలించినట్లు వివరించారు. రెండేళ్ల క్రితం చైనాకు చెందిన ఓ బెట్టింగ్‌/గేమింగ్‌ యాప్‌ హెచ్‌డీఎ్‌ఫసీ ఖాతాలోని రూ.47 కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు గుర్తుచేశారు.  

Updated Date - 2022-09-11T08:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising