ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ ఫిరాయింపుల్లో ఘనులు గోవా ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2022-01-22T19:48:29+05:30

పార్టీల ఫిరాయింపుల్లో గోవా ఎమ్మెల్యేలు దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈసారి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్టీల ఫిరాయింపుల్లో గోవా ఎమ్మెల్యేలు దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు 60 శాతానికి పైనే ఉండటం అసాధారణమని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగున్నాయి.


ఏడీఆర్ నివేదిక ప్రకారం, 2017 మార్చి నుంచి 2022 జనవరి వరకూ 27 మంది ఎమ్మెల్యేలు ఆయా పార్టీలతో తమకున్న రాజకీయ అనుబంధానికి ఉద్వాసన పలికారు. ఆ ప్రభావం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపై పడింది. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఇందువల్ల బీజేపీ బాగా లబ్ధిపొందింది.


''దేశంలో ఇంకెక్కడా జరగనంతగా పెద్ద స్థాయిలో గోవాలో పార్టీలు ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి. ఓటర్లు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం అత్యాశతోనే విచక్షణారహితం కట్టుబాట్లు, క్రమశిక్షణను తిలోదకాలు ఇస్తున్నారు" అని ఏడీఆర్ గోవా కోఆర్డినేటర్ భాస్కర్ అసోల్డెకర్ తెలిపారు. కాగా, ప్రజా తీర్పుకు గండికొడుతూ నాయకులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుండటం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుందని, ఇప్పుడు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి మరింత మంది ప్లేయర్స్ ఎన్నికల బరిలోకి వచ్చిచేరారని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ప్రభాకర్ టింబ్లే అన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏమాత్రం ఫిరాయింపులను అడ్డుకోలేకపోతోందని అన్నారు.

Updated Date - 2022-01-22T19:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising