ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జెంటీనాలోనూ Monkeypox virus కలకలం

ABN, First Publish Date - 2022-05-28T18:31:25+05:30

పలు దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ అర్జెంటీనా దేశానికి పాకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యూనస్ ఎయిర్స్: పలు దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ అర్జెంటీనా దేశానికి పాకింది.అర్జెంటీనాలో తాజాగా రెండు మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి.యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్‌లలో కూడా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అర్జెంటీనాలో శుక్రవారం స్పెయిన్ నుంచి వచ్చిన ఇద్దరు పురుషులకు మంకీపాక్స్ వైరస్ సోకింది. లాటిన్ అమెరికాలో మొదటిసారిగా ఈ వైరస్ ఉనికిని నిర్ధారించారు. అర్జెంటీనాకు వచ్చిన స్పెయిన్ నివాసితో సంబంధం ఉన్న వ్యక్తికి కూడా మంకీపాక్స్ సోకింది.మంకీపాక్స్ వ్యాధికి గురైన వ్యక్తుల సన్నిహితులందరికీ వైద్యపరీక్షలు చేస్తున్నామని అర్జెంటీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


మంకీపాక్స్ సోకిన రోగులు ఐసోలేషన్ లో ఉన్నారని అర్జెంటీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20 కంటే ఎక్కువ దేశాల్లో ఇటీవల దాదాపు 200 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ కేంద్రంగా 98 పాజిటివ్ కేసులు నమోదైనాయని ఆరోగ్య అధికారులు శుక్రవారం ధృవీకరించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 106, పోర్చుగల్ 74 కేసులు నమోదయ్యాయి.యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలో కూడా ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి.

Updated Date - 2022-05-28T18:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising