ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మహమ్మారిలా మంకీపాక్స్‌?

ABN, First Publish Date - 2022-05-23T08:13:57+05:30

అమెరికాలో, యూర్‌పలో చిన్నగా మొదలైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా కేసులు

లండన్‌, మే 22: అమెరికాలో, యూర్‌పలో చిన్నగా మొదలైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఆదివారం నాటికి.. 12 దేశాల్లో 180కి పైగా నిర్ధారిత, అనుమానిత కేసులను గుర్తించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా యూర్‌పలోని 9 దేశాల్లో 100కు పైగా కేసులున్నట్టు పేర్కొంది. యూర్‌పలోని జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. అటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీ పాక్స్‌ కేసులు వచ్చాయి. ఇక, ఇజ్రాయెల్‌లో మంకీపాక్స్‌తో బాధపడుతున్న వ్యక్తి ఇటీవలే పశ్చిమ యూరప్‌ నుంచి తిరిగి వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉండాల్సిందిగా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, భారత వైద్య పరిశోధన మండలిని ఆదేశించింది.  కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఆరోగ్యశాఖలను అప్రమత్తం చేశాయి. అయితే ఈ వైరస్‌ గురించి అంత భయపడాల్సిన పని లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వైర్‌సను ఎదుర్కోవడానికి సమర్థమైన ఔషధాలు ఉన్నాయని.. ఈ వైరస్‌ ప్రాణాంతకం కాదని వారు భరోసా ఇస్తున్నారు. 


ఏమిటీ వైరస్‌?

ఆర్థోపాక్స్‌ వైరస్‌ కుటుంబానికి చెందిన (మశూచికి కారణమయ్యే వారియోలా వైరస్‌ కూడా ఈ కుటుంబానికి చెందిందే) ఈ వైరస్‌.. మశూచి తరహా పొక్కుల్నే కలిగిస్తుంది. కాకపోతే మరీ అంత తీవ్రంగా కాకుండా కొద్దిపాటి తీవ్రత మాత్రమే ఉంటుంది. ఆ పొక్కులతోపాటు.. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్‌ గ్రంథుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 1958లో తొలిసారి దీన్ని కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అనే పేరు వచ్చింది. 1970 నుంచి 11 ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదయ్యాయి. పాశ్చాత్య దేశాల్లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. 

Updated Date - 2022-05-23T08:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising